ప్రజాశక్తి-కడియం కడియపులంక పంచాయతీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల్లో అక్రమాలపై గురువారం విచారణ చేపట్టారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి నిధులపై జరిగిన రూ.లక్షల రుణాల్లో విఒఎలు అవకతవకలకు పాల్పడినట్టు ఆయా సంఘాల సభ్యులు జిల్లా స్థాయి అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రామ్‌జీని ఆశ్రయించగా, జిల్లా కలెక్టర్‌కు సంఘ సభ్యులు ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 15 మంది సభ్యులతో మూడు బృందాలను ఏర్పాటు చేయగా డిఆర్‌డిఎ ఉన్నతాధికారుల బృందం కడియపులంక పంచాయతీలో గురువారం విచారణ ప్రారంభించారు. స్త్రీనిధి ఎజిఎం ఎం.ధర్మేంద్ర, డిపిఎం వై.జనార్దన్ రావు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాంజీ సమక్షంలో విచారణ చేపట్టారు.
