గుండెపోటుతో ఇంటిలిజెంట్ హెడ్ కానిస్టేబుల్ మృతి 

ప్రజాశక్తి-చాగల్లు : ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఈ డేవిడ్ రాజు (48) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు.  తూర్పు గోదావరి జిల్లా చాగల్లులోని నివాసముంటున్న ఆయనకు స్వగృహంలో తెల్లవారుజామున గుండె నొప్పి రావడంతో నిడదవోలు ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ ఈసీజీ తీసిన వైద్యులు చూసిన వరకు గుండెపోటుగా నిర్ణయించుకుని రాజమండ్రిప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడ ఐసియూలో చికిత్స పొందుతుండగా మధ్యాహ్నం మరోసారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈయన స్వస్థలం ఏలూరు సమీపంలోని మముడూరు. ఉద్యోగ రిత్యా కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ చాగల్లులో స్వగృహం నిర్మించుకున్నారు. ఆయన మృతి పట్ల పోలీస్ సిబ్బంది సంతాపం తెలిపారు.

➡️