డిసిహెచ్‌ఎస్‌ను కలిసిన ఉద్యోగ నేతలు

Apr 10,2025 22:38
డిసిహెచ్‌ఎస్‌ను కలిసిన ఉద్యోగ నేతలు

ప్రజాశక్తి-కడియం ఇటీవల జిల్లా వైద్య సేవల సమన్వయాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ ఎం.పద్మను ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ నాయకులు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె అసోసియేషన్‌ తరపున పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు, అందుకు తాము సహకరిస్తామని బదులిచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు పి.రవికుమార్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని తరగతుల సిబ్బందికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటి విషయమై అసోసియేషన్‌ తరపున గత 15 రోజుల క్రితం జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు నోటీసు ఇచ్చామని తెలిపారు. త్వరితగతిన జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించగలరని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఫార్మసీ ఆఫీసర్‌ ఎ.రవికుమార్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ వలీమా పాల్గొన్నారు.

➡️