శాస్త్రీయ దృక్పథం పెంపునకు జెవివి కృషి

Feb 2,2025 22:23
శాస్త్రీయ దృక్పథం పెంపునకు జెవివి కృషి

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని జెవివి రాష్ట్ర కార్యదర్శి కెఎంఎంఆర్‌.ప్రసాద్‌ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్లీనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జెవివి నాయకులు, కార్యకర్తలు నిబద్ధతతో పని చేయాలన్నారు. ప్రస్తుత కాలంలో మద్యపానం, ధూమపానం, డ్రగ్స్‌ వాడకం ఎక్కువైందన్నారు. యువత వాటి బారిన పడకుండా జెవివి పనిచేయాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జెవివి గౌరవ అధ్యక్షులుగా ఎం.మల్లికార్జునరావు, వై.పైడియ్య, డాక్టర్‌ చైతన్య శేఖర్‌, అధ్యక్షునిగా కె.భీమయ్య, ఉపాధ్యక్షులుగా టి.వసంతరావు, ఎఎన్‌.సుధారాణి, సిహెచ్‌.శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.రవిబాబు, కోశాధికారిగా జి.తాతారావు, కార్యదర్శులుగా జి.రాజేష్‌కుమార్‌, పిఎం.శిరోమణి, కెఎల్‌.జ్యోతి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కన్వీనర్లుగా కె.శ్రీకృష్ణసాయి, బిఎల్‌ఎన్‌.ఆనంద్‌బాబు, సమతా కన్వీనర్‌గా వై.బేబిరాణి, యూత్‌ వింగ్‌ కన్వీనర్‌గా సిహెచ్‌.నిశ్చల్‌ ఎన్నికయ్యారు.

➡️