రామోజీరావు మృతికి పలువురు సంతాపం

Jun 8,2024 12:04 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి మండలం(తూర్పుగోదావరి జిల్లా ) : ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత పత్రికా రంగం నవశక నిర్మాణ ప్రదాత ఉత్తమ విలువలతో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన స్వర్గీయ చెరుకూరి రామోజీ రావు మరణం తీరని లోటు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నియోజవర్గ మండల నాయకులు పలువురు సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే కందుల దుర్గేష్ నియోజవర్గ తెదేపా ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు రాజమండ్రి పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొడ్డు రామాంజనేయులు,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రవివర్మ, తెదేపా జనసేన మండల అధ్యక్షులు అతికాల శీను, పిప్పర రవికుమార్, పి.నాగేశ్వరరావు మాజి సొసైటీ అధ్యక్షులు కరటూరు గోపాలకృష్ణ కంటిపూడి సూర్యనారాయణ వాకలపూడి వీర్రాజు బిజెపి సత్యనారాయణ పసలపూడి భద్రయ్య కోట శ్రీను బండారు సాయి పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

➡️