రామోజీరావు మృతికి పలువురి సంతాపం

Jun 8,2024 23:09
రామోజీరావు మృతికి పలువురి సంతాపం

ప్రజాశక్తి-యంత్రాంగం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి పలువురు పాత్రికేయులు, వివిధ పార్టీల నాయకులు శనివారం సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. పెరవలి నిడదవోలు ఎంఎల్‌ఎ కందుల దుర్గేష్‌, టిడిపి నియోజవర్గ ఇన్‌ఛార్జి బూరుగుపల్లి శేషారావు, బొడ్డు రామాంజనేయులు, రవివర్మ, అతికాల శ్రీను, పిప్పర రవికుమార్‌, పి.నాగేశ్వరరావు, కరుటూరి గోపాలకృష్ణ, కంటిపూడి సూర్యనారాయణ, వాకలపూడి వీర్రాజు, సత్యనారాయణ, పసలపూడి భద్రయ్య, కోట శ్రీను, బండారు సాయి రామోజీ మృతికి సంతాపం తెలిపారు మండపేట టిడిపి కార్యాలయంలో ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు సంతాపం తెలిపారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చుండ్రు శ్రీవర ప్రకాష్‌, ఉంగరాల రాంబాబు, సాధనాల చక్రపాణి, అవసరాల వీర్రాజు, మల్లిపూడి గణేష్‌, చింతల శ్రీను, పిట్టా రాజు, పర్వతిన వీర్రాజు, చిట్టూరి ప్రసాద్‌, చుండ్రు సోమరాజు, గెడా శ్రీనివాస్‌, చేకూరి సూరిబాబు పాల్గొన్నారు.తాళ్లపూడి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జొన్నకూటి ప్రమోద్‌ కుమార్‌, పాత్రికేయులు అప్పన రాజా, అనంతం రామకష్ణ, సత్యనారాయణ, కోటేశ్వరరావు, బ్రహ్మానందం, గోపాలకష్ణ, అప్పన గుప్తా, శ్రీను, గజ్జరం గ్రామంలో టిడిపి నాయకులు గన్నిన సత్తిబాబు రామోజీకి ఘనంగా నివాళులర్పించారు.గోకవరం టిడిపి కార్యాలయం వద్ద రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. దేవరపల్లి మాజీ హోమ్‌ మంత్రి తానేటి వనిత రామోజీ మృతికి సంతాపం తెలిపారు. ప్రెస్‌ క్లబ్‌ కార్యాలయంలో అధ్యక్ష కార్యదర్శులు ఆబోతు అనిల్‌ కుమార్‌, జంగా వెంకట రామిరెడ్డి, సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దాసరి రామారావు, సిర్రా కృపారావు, కె.మాణిక్యం, జానపాటి రత్నకిషోర్‌, టి.గాబ్రియల్‌, పాముల తిరుపతిరావు, దాసరి ఠాగూర్‌ పాల్గొన్నారు. కొవ్వూరు రూరల్‌ ప్రెస్‌ క్లబ్‌లో అధ్యక్షుడు నల్లా నాయుడు బాబు న్యాయవాదులు ఏలూరు గోపాలకృష్ణ, కోడూరి సూర్య రాఘవులు రామోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోలి వెంకట రత్నం, తోరం నగేష్‌, సాక్షి సత్యనారాయణ, యువరాజు దాసు, శర్మ, దుర్గా ప్రసాద్‌, అవినాష్‌, సురేష్‌, ప్రకాష్‌, యర్రన్న, రవి, అయ్యప్ప, గంథం బాపూజి, సాయి పాల్గొన్నారు.

➡️