ప్రజాశక్తి -రాజమహేంద్ర వరం రూరల్
నగరంలో జెఎన్ రోడ్డులోని ఓ ప్రయివేటు సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన డిస్ట్రిక్ ఇండిస్టీ మీట్ – సంకల్ప్ ఉత్సాహంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జెసి చిన్నరాముడు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడారు. జెసి ఎస్.చిన్నరాముడు హాజరై మాట్లాడారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం పెంచే ప్రయత్నంలో సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. స్ధానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, జిల్లా యంత్రాంగం, పరిశ్రమల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. పరిశ్రమలు పేర్కొన్న అంశాలను గుర్తించి ఆ మేరకు మెరుగైన శిక్షణా కార్యక్రమాలను చేపడతామన్నారు. సభానంతరం ప్యానల్ డిస్కషన్ సెషన్ నిర్వహించారు. సర్వా రాయ షుగర్స్ ప్రతినిధి రాజ్‌కుమార్, ఆటో మోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి అశోక్ కుమార్, వరుణ్ మోటార్స్ ప్రతినిధి సుబ్బారావు ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్, గవర్నమెంట్ కాలేజీ, రాజమండ్రి ప్రతినిధి యర్రా రాము, నవతా ట్రాన్స్‌పోర్ట్ ప్రతినిధి వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా బేదంపూడి బాబు వ్యవహరించారు. ప్రియా వందన సమర్పణ చేశారు. ఈ సభలో విద్యార్థులకు ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేసిన కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సునీత, స్కిల్ హబ్‌కు అందించిన సేవలకు సర్వారాయ షుగర్స్ ప్రతినిధి రాజ్ కుమార్‌కు పురస్కారాలు అందించారు. పలు ఇండిస్టీల ప్రతినిధులు, మానవ వనరులు ఎగ్జిక్యూటివ్‌లు వివిధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐ ప్రిన్సిపల్, జిల్లా ఉపాధి కల్పనాధికారి హరిచంద్ర ప్రసాద్, యంగ్ ప్రొఫెషనల్ సిహెచ్ రాజ్ కుమార్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి.మురళి లుతదితరులు పాల్గొన్నారు.
