ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అభ్యర్ధి వేణు

Apr 1,2024 15:32 #East Godavari

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.   ప్రచారంలో ముందుగా ఈరోజు శుభ ముహూర్తం ప్రకారం రాయుడు పాకాల గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్ధి గూడూరి. శ్రీనివాస్, అభ్యర్థితో పాటు ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి. షర్మిళ రెడ్డి గడపగడపకు ప్రచారంలో పాల్గొన్నారు. రాయుడు పాకాల ఎన్నికల ప్రచారంలో భాగంగా చెల్లుబోయిన.వేణుగోపాలకృష్ణ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని మరియు రాజమండ్రి ఎంపీగా డాక్టర్ గూడూరి. శ్రీనివాస్ని గెలిపించాలని రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజాల బాబు, గొందేసి శ్రీనివాస్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️