ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిజిటిగా పనిచేస్తున్న మోసెస్ ఇమ్మానియేల్ (61) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వీరాజు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది ఎస్ఎంఎస్ కమిటీ చైర్మన్ కే గోపాల్ కృష్ణ కమిటీ సభ్యులుసంతాపం తెలిపారు. వారు కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని తెలిపారు. ఇమోనియల్ కు భార్య కుమారుడు కుమార్తె ఉన్నట్లు తెలిపారు.
