జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ 

May 16,2024 13:58 #East Godavari

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధి, కే. సావరంలో గురువారం వైద్యాధికారి డాక్టర్ ఆర్ ఎస్ ఎస్ వి ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం, డెంగ్యూ నివారణా అవగాహన ర్యాలీ నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో బాగంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో – డెంగ్యూ వ్యాధిని నివారిద్దం అనే నినాదం తో ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలన్నారు. డెంగ్యూ వ్యాధి రాకుండా, దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమ తెరలు వాడాలని సూచించారు. రానున్న వర్షాకాలం లో ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలన్నారు. ఇంటి ఆవరణ లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం. సుబ్రహ్మణ్యం, ఆరోగ్య పర్యవేక్షకులు జీన్నూరి శ్రీనివాస రావు, ఎం‌ఎల్‌హెచ్‌పి సంధ్యా లక్ష్మి, మహిళా ఆరోగ్యకార్యకర్త వై. రత్నకుమారి, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ లు, విజయ్, చిరంజీవి, రాము, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, పాల్గొన్నారు.

➡️