ప్రజాశక్తి – దేవరపల్లి, గోకవరంబాల్య వివాహాలకు వ్యతిరేకంగా అంగన్‌వాడీలు బుధవారం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని కె.నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం, నేరం అన్నారు. బాల్య వివాహాలు, బాలికల రక్షణ ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ, ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలన్నారు. ‘బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిఎం మెంబర్స్ నాగలక్ష్మి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు విజయలక్ష్మి, శశికళ, విజయశాంతి పాల్గొన్నారు. గోకవరం మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాల్య వివాహలపై ముక్తభారత్ అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కేండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ మండల సూపర్‌వైజర్స్ పి.ఇందిరా రాణి, చంద్రమ్మ, రంజని, అంగన్‌వాడీ వర్కర్స్, ఐకెపి విఒ ప్రమీల పాల్గొన్నారు.