ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్లగ్ మార్చ్

Apr 1,2024 12:14 #East Godavari

ప్రజాశక్తి-చాగల్లు : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ  బలగాలతో కలిసి సోమవారం పోలీసు కవత్తు నిర్వహించారు. కొవ్వూరు రూరల్ సీఐ పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోో బ్రాహ్మణగూడెం దారవరం మార్కొండపాడు చంద్రవరం  గ్రామంలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీస్ అధికారులు గ్రామంలో తిరుగుతూ ప్రజలకు ఆత్మీయ విశ్వాసం పెంపొందిస్తూ వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్క్ నిర్వహించారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేసుకోవచ్చని తెలిపారు. చాగల్లుఎస్ఐ పి నాగరాజు  మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని దానికి పోలీసు సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా కల్పిస్తామన్నారు.

➡️