గ్లోబల్ సిటిజన్లుగా మారాలి

Feb 10,2024 14:27 #East Godavari
Poor students should become global citizens

ప్రజాశక్తి – ఉండ్రాజవరం : గ్రామీణ, పేద విద్యార్థులను భవిష్యత్ గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. మండలంలోని చివటం, వేలివెన్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న టాబ్ లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా మెరుగైన చదువులు దిశగా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతిలోకి అడుగుపెట్టిన వెంటనే ప్రతి విద్యార్థికి, టాబ్ ల పంపిణీ తో పాటు, ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు పంపిణి చేస్తు, ఆఫ్ లైన్లో కూడా పనిచేసే విధం గా చర్యలు తీసుకుంటున్నారన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు, పాఠశాలలో మౌలిక వసతులు మెరుగు పరచడానికి జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, పాఠశాలలో నాడు నేడు, వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల, విద్య పట్ల తనకున్న తపన తెలియజేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి విద్యార్థులు, వారి వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, జెడ్ పి టి సి నందిగం భాస్కర రామయ్య, చివటం పిఎసిఎస్ అధ్యక్షులు కొఠారు సత్యనారాయణ, పాలాటి శరత్, విద్యాకమిటీ చైర్మన్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండల విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️