సుబ్బరాజు కుటుంబానికి ప్రెస్‌ క్లబ్‌ సాయం

May 15,2024 22:29
సుబ్బరాజు కుటుంబానికి ప్రెస్‌ క్లబ్‌ సాయం

ప్రజాశక్తి-కడియం (మండపేట)సుబ్బరాజు కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మండపేట ప్రెస్‌ క్లబ్‌ అండగా ఉంటుందని క్లబ్‌ అధ్యక్షుడు రెడ్డి ఒమేష్‌ ఆన్నారు. ఇటీవల కిడ్నీ సంబంధిత సమస్యతో మండపేట ప్రజాశక్తి విలేకరి పల్లి సుబ్బరాజు ఆకస్మికంగా మృతి చెందిన నేపథ్యంలో సుబ్బరాజు భార్య నీలిమకు ప్రెస్‌ క్లబ్‌ సభ్యులంతా తమ వ్యక్తిగత సాయంగా రూ.60 వేలు బుధవారం అందజేశారు. దాతల నుంచి కూడా మరికొంత సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు వేమగిరి నూకరాజు, జాయిన సాయి సత్యనారాయణ, గుడ్ల రవీంద్ర బాబు, కోలపల్లి శివాజీ, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️