ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌పై నిరసన

Feb 5,2025 22:32

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంపార్లమెంట్‌లో బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు నిరసనంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్‌ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టి.అరుణ్‌, ఎఐటియుసి నాయకులు టి.మధు, ఐఎఫ్‌టియు నాయకులు డి.శ్రీనివాసరావు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం లేబర్‌ కోడ్స్‌ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం కార్మికుల హక్కులను కాల రాయడం తప్ప మరొకటి కాదన్నారు. స్వాతంత్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న కార్మికుల కనీస హక్కులను కాలరాస్తూ కార్మికుల్ని కట్టు బానిసలుగా కార్పొరేట్లకు అందలం ఎక్కించేందుకు కార్మికులను పని దోపిడీకీ మరింత తీవ్రతరం చేసేందుకు ఈ లేబర్‌ కోడ్స్‌ తీసుకొచ్చారన్నారు. ఈ ప్రమాదాన్ని కార్మికులు నిరసనల ద్వారా తెలియజేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కొత్త యూనియన్ల రిజిస్ట్రేషన్‌లను 45 రోజుల్లో పూర్తి చేయాలన్న నిబంధనలను నిలుపుదల చేసేందుకు తమిళనాడులో కార్మికులు భారీ పోరాటం చేసి విజయం సాధించారని తెలిపాకరు. కార్మికులను ఈ కోడ్స్‌ను అడ్డుపెట్టుకొని హైయర్‌ అండ్‌ ఫైర్‌ పద్ధతులో ఇష్టం వచ్చినట్లు తొలగించడం, ఫిక్స్‌ టర్మ్‌ ఎంప్లారుమెంట్‌తో నోటీసు ఇవ్వకుండా బెనిఫిట్స్‌ ఇవ్వకుండా తొలగించడం చేస్తారన్నారు. లేబర్‌ కోడ్స్‌ వల్ల కార్మికుల ప్రాణాలకే భద్రత లేకుండా పోవడంతో పాటు పిఎఫ్‌, ఇఎస్‌ఐ బోనస్‌ కనీస వేతనాలు వంటి ప్రాథమిక చట్టాల అమలు అధోగతి పాలయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర్‌బాబు, నాయకులు బి.పవన్‌, ఎస్‌ఎస్‌.మూర్తి, టిఎస్‌.ప్రకాష్‌, సావిత్రి, మురళ, బి.పూర్ణిమరాజు, కర్రి రామకృష్ణ, రవి, బేబిరాణి, రాంబాబు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు ఎఐటియుసి శ్రామిక మహిళా పోరం కన్వీనర్‌ పి.లావణ్య, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, వ్యవసాయ కార్మిక సంఘం టి.నాగేశ్వరరావు, ఎఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు, ఐఎఫ్‌టియు నాయకులు ఎన్‌.దుర్గారావు, కోసూరి అప్పలరాజు ఐఎఫ్‌టియు నగర సహాయ కార్యదర్శి, వనుం సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, సతీష్‌ పాల్గొన్నారు.

➡️