ప్రజాశక్తి – నిడదవోలు
సిపిఎం ప్రజా చైతన్య యాత్ర సోమవారం నిడదవోలులో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సోమవారం సిపిఎం బృందం తీరుగూడెంలో నిర్మించిన టిడ్కో గృహాలను పరిశీలించింది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడారు. 2014లో అప్పటి టిడిపి ప్రభుత్వం 1,200 మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించిందన్నారు. కొంత డబ్బు ప్రభుత్వం లబ్ధి దారుల నుంచి వసూలు చేసిందన్నారు. 2018లో నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇళ్లను లబ్ధి దారులకు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. అప్పట నుంచి చేసిన అప్పులకు పేదలు ఇంకా వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నారన్నారు. లబ్ధి దారులకు ప్రభుత్వం ఇళ్లు అప్పగించకపోయినా, బ్యాంకర్లు మాత్రం వాయిదాలు కట్టించుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8నెలలు కావొస్తున్నా ఇంత వరకు లబ్ధి దారులకు ఇళ్లు అప్పగించలేదన్నారు. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు కూడా చేరుకుంటున్నాయన్నారు. తక్షణమే ఇళ్లను లబ్ధి దారులకు అప్పగించాలన్నారు. లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తామని రాంబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.సుందరబాబు, నాయకులు జి.డానియేల్, జి.కృష్ణరసూల్, జి.ప్రసన్న, డి.రమేష్, కె.సత్యనారాయణ, శ్రీ రామ్, వి.ప్రభాకర్, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
