ప్రజా చైతన్యయాత్రలో నాయకులు
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
అర్హులైన పేదలందరికీ ఇళ్లు కేటాయించాలని సిపిఎం జిల్ల కమిటీ సభ్యులు బి.పూర్ణిమారాజు డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్రలో బుధవారం ఆవలోని వాంబేగృహాలను సిపిఎం బృందం సందర్శించింది. స్థానికులు పలు సమస్యలను బృందం దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ బిల్లులు నెలనెలా పెరిగిపోతున్నాయని పలువురు వాపో యారు. ఈ సందర్భంగా పూర్ణిమరాజు మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరంలో సుమారు 20 వేల మందికి ఇళ్ల పట్టాలు (హామీ పత్రాలు)ను ఇచ్చిందన్నారు. కాని నేటికీ స్థలం చూపించలేదని తెలిపారు. వెంటనే హామీ పత్రాలు ఇచ్చిన వారికి స్థలం చూపించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలం చూపకపోవడంతో లబ్ధిదారులు అద్దె ఇళ్లల్లోనే గడపాల్సి వస్తుందన్నారు. అద్దెలు కట్టలేక ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరుదబాటు ఛార్జీల పేరు ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపుతుందన్నారు. గత ప్రభుత్వం మోపిన ట్రూ ఆఫ్ చార్జీల బారాన్ని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నారు. దీనివల్ల సగటున ప్రతి కుటుంబంపై రూ.200 నుంచి రూ.500 అదనపు భారం పడుతుదంన్నారు. వెంటనే ట్రూఅప్ ఛార్జీలను రద్దు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. ఈ ప్రజా చైతన్య యాత్ర మార్చి 17 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ బృందంలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఐ.సుబ్రహ్మణ్యం, డివైఎఫ్‌ఐ నాయకులు వి.రాంబాబు, రాజేష్, పాపయ్యమ్మ పాల్గొన్నారు. దేవరపల్లి : దేవరపల్లి గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా సిపిఎం బృందం దేవరపల్లిలో చంద్రబాబు నాయుడు కాలనీలో పర్యటించింది ఈ సందర్భంగా పలువురు సమస్యలను ఏకరువు పెట్టారు. కాలనీ ఏర్పడి 25 ఏళ్లయినా డ్రెయినేజీలను నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. డ్రెయినేజీలు లేక వాడకపు నీరు వీధుల్లోకి వస్తుందన్నారు. వర్షా కాలంలో పరిస్థితి మరీ దయణీయంగా ఉంటుందన్నారు. వాడకపు నీరు మురుగునీరు రోడ్లపైకి చేరి తీవ్ర దుర్గంధం వస్తుందన్నారు. రోజులతరబడి మురుగుపేరుకుపోవడంతో దోమలు విపరీతంఆ పెరిగిపోతున్నాయి. తాగునీటి సదుపాయం లేకపోవడం వల్ల కిలోమీటర్ దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. పైప్ లైన్లు వేసినప్పటికీ మోటార్ కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల తాగునీటి సరఫరా జరగట్లేదన్నారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఎస్ భగత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే నాయకులు వస్తున్నారన్నారు. గెలిచిన తరువాత ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారన్నారు. తక్షణమే పాలకులు స్పందించాలని లేకపోతే స్థానికులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉండవల్లి కృష్ణారావు, పిన్నమనేని సత్యనారాయణ, కె.రత్నాజీ, అయినపర్తి శ్రీనివాసరావు తదితురులు పాల్గొన్నారు. స్థానికులు అడపా సూర్యారావు, అడపా గోవర్ధన్, టి.రామకృష్ణ, ఎన్.కుమారి, టి.మోహన్, షేక్ బాషా, షేక్ మీరాభి, టి.బన్నీ, జి.కుమారి, ఎ.వెంకటేష్ ఖండవల్లి అనంతలక్ష్మి తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నిడదవోలు : అసంపూర్తిగా ఉన్న తహశీల్దార్ కార్యాలయం నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, సిపిఎం డిమాండ్ చేసింది. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం బృందం మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న నిర్మాణ స్థలం వద్ద ధర్నా నిర్వహించింది.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడారు. రూ.40లక్షలతో మున్సిపల్ కార్యాలయం పక్కనే వున్న స్థలంలో తహశీల్దార్ కార్యాలయాన్ని నిర్మించేందుకు గత ప్రభుత్వం పనులను ప్రారంభించిందన్నారు. అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారన్నారు. అనంతరం పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని తెలిపారు. తక్షణమే నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో కలిపి రెండు అంతస్తుల భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.సుందరబాబు, జి.కృష్ణ, జి.డేనియేల్, జి.ప్రసన్న, వి.ప్రభాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు
