13న పాఠశాలల పునఃప్రారంభం 

Jun 10,2024 14:42 #East Godavari

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: వేసవి సెలవుల అనంతరం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని పాఠశాలలు జూన్ 13, గురువారం పునః ప్రారంభం అవుతాయని మండల విద్యాశాఖాధికారి సిహెచ్ సక్సేనా రాజు సోమవారం తెలిపారు. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన మంగళవారం, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండడంతో ఒకరోజు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 3572 మంది విద్యార్థులకు అందించేందుకు స్కూల్ బ్యాగులు, షూస్, రెండు జతల సాక్స్, బెల్ట్ లతో సిబ్బంది కిట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 8, 9, 10 తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ వార్షిక తనిఖీలలో భాగంగా మండలంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల లోని రిజిస్టర్లు, అడ్మిషన్లు తదితరాలు తనిఖీ చేస్తున్నట్లు, విద్యార్థులకు యూనిఫామ్స్ ఇంకా రావాల్సిందన్నారు.

➡️