ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు-నెలటూరు లయన్స్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ డే వేడుకలు ఆళ్ల జానకి రామ సుబ్బలక్ష్మి లైన్స్ క్లబ్ వృద్ధాశ్రమంలో మంగళవారం రాత్రి సీనియర్ సిటిజన్స్ డే ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాగల్లు మండలం మానవత గౌరవ డైరెక్టర్ ఆళ్ల జానకి రామారావును సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మానవత డైరెక్టర్లు ఆళ్ళ వీర వెంకట సత్యనాయణ (పెదబాబు), పిచ్చికల వెంకట సత్యనాయణ, కోడూరి వెంకట శ్రీనివాస్, వల్లిపల్లి వెంకట రామారావు , వల్లభనేని వీర వెంకట సత్యనాయణ, ఇ.సి.సభ్యులు కోడి నాగేశ్వర రావు, కోటా నాగేశ్వరరావు, సి.హెచ్.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు, కార్యక్రమం చేసిన చాగల్లు-నెలటూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మానవత డైరెక్టర్ ఆళ్ళ వీర వెంకట సత్యనాయణ (పెదబాబు) సన్మాన గ్రహీతలు ఆశీర్వదించి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు.