ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉచిత ఇసుక ప్రవేశపెట్టడంతో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇసుక లారీలలో పరిమితికి మించి క్యాబిన్ ఎత్తు వరకు ఇసుకను వేసేస్తుండడంతో వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు ఇసుక ఎగిరి వారి కంట్లో పడడమే కాకుండా ములుపులు వద్ద అటూ ఇటూ రోడ్డుకి ఇరువైపులా ఇసుక మేటలుగా పేరుకుపోతున్నాయి. దీంతో వాహనదారులు ఇసుక వలన బండిచక్రాలు జారి పడిపోతున్నారు. ఈ రోజూ ఉదయం జెనిపల్లి సత్యనారాయణ దంపతులు చర్చికు వెళ్లాలని బయలుదేరడంతో ధవలేశ్వరంలోని స్థానిక క్వారీ కెనాల్ సెంటర్ వద్దకు చేరుకొనేసరి ఆక్కడ మలుపు తిప్పుతుండగా ఇసుక వలన జారిపడి పోవడంతో జనపల్లి సత్యనారాయణ భార్య అయిన జనపల్లి లక్ష్మి రోడ్డు మీద పడిపోవడంతో రోడ్డు తలకు తగిలి రక్తపు గాయం కావడంతో హుటాహుటిన హాస్పటల్ తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స అందించడంతో అపాయం తప్పింది. తరుచు ఆక్సిడెంట్ లు జరుగుతున్న, కూత వేటు దూరంలో కలెక్టర్ కార్యాలయం ఉన్న కనీసం భారీ ఇసుక వాహనాలను పరిమితికి మించి లోడు వెళుతున్న చెక్పోస్టులను ఏర్పాటు చేసిన కట్టడి చేయలేకపోవడంతో పలు అనుమానాలుకు తావిస్తున్నాయి. ఇక నైన కలెక్టర్ పి.ప్రశాంతి ప్రత్యేక దృష్టిపెట్టి ఇసుక లారీలను ఇకనైనా కట్టడి చేయాలని అధికారులను. స్థానికులు కోరుతున్నారు.
