అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Jan 16,2025 23:12
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి-గోపాలపురం రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి వేళ్లచింతలగూడెం గ్రామం ఆదర్శంగా నిలిచిందని సాంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. గ్రామంలో ఆర్‌ అండ్‌ ఎం ఫౌండేషన్‌ చైర్మన్‌ గంటా మధుకృష్ణ, ఎంఎల్‌ఎ మద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ నెల రెండో తేదీ నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వీటిలో భాగంగా సుమారు 14 రోజుల పాటు గ్రామంలో రాష్ట్రస్థాయి, క్రికెట్‌ టోర్నమెంట్‌, జాతీయస్థాయిలో బాలికల బాలుర కబడ్డీ, సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. సుమారు రూ.కోటి వ్యయంతో నియోజకవర్గ స్థాయిలో జబర్దస్త్‌ టీము, ప్రముఖ సింగర్స్‌తో, సినీ యాంకర్స్‌తో, సాంస్కతిక నత్యాలతో అలరించారు. శివారెడ్డి, గడ్డం నవీన్‌, కల్పన, కాసర్ల, శ్యామ్‌, అదిరే అభి, రాజమౌళి, సింగర్‌ మోహన, సింగర్‌ కృష్ణ చైతన్య, సాకేత్‌, వాగ్దేవి, శిరీష, శ్రేయ, గణేషన్‌, గోవింద్‌, రమేష్‌ ఆర్కెస్ట్రా టీములతో, సంప్రదాయక నృత్యాలతో ప్రేక్షకులను బుధవారం రాత్రి అలరించారు. సంక్రాంతి సంబరాలు ముగింపు సందర్భంగా వేలచింతలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్‌, ఎంఎల్‌ఎలు బడేటి రాధాకృష్ణ, చిర్రి బాలరాజు, బత్తుల బలరామకృష్ణ, ధర్మరాజు, ఆదిరెడ్డి వాసు, బొలిశెట్టి శ్రీనివాసరావు, టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొడ్డిగర్ల సువర్ణ రాజు మాట్లాడారు. ఒక మారుమూల గ్రామంలో పార్టీలకు అతీతంగా భారీ స్థాయిలో సంబరాలు నిర్వహించడం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సంక్రాంతి పండుగను ప్రజలు ఐక్యమత్యంతో సాంప్రదాయకంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు. ఇంతటి భారీ స్థాయిలో సంక్రాంతి సంబరాలు జరపడం పట్ల ఎంఎల్‌ఎ మద్దిపాటి వెంకటరాజు, ఆర్‌ అండ్‌ ఎమ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ గంటా మధు కృష్ణను వారు అభినందించారు.

➡️