ప్రజాశక్తి – నిడదవోలు
కెవిపిఎస్ ఆధ్వర్యంలో సావిత్రీ బాయికి ఘనంగా నివాళులర్పించారు. సోమవారం సావిత్రిబాయి వర్థంతిని కెవిపిఎస్, యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిడదవోలు మహిళా కళాశాలలో నిర్వహించారు. తొలుత సావిత్రీ బాయి ఫూలే విగ్రహానికి కెవిపిఎస్ నాయకులు కెవిపిఎస్ జిల్లా ప్రదాన కార్యదర్శి జువ్వల రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువాద సమాజంలో మతం, కులం పేరుతో తీవ్రమైన సామాజిక అంతరాలు ఉన్న దేశంలో 195 సంవత్సరాలు క్రితం ప్రగతిశీలం ఆలోచనలతో భర్త ఫూలేతో కలిసి బాలికా విద్యకు సావిత్రిబాయి చేసిన కృషి ఎనలేనిదన్నారు. మహిళలు చదువుకుంటేనే జాతి ముందుకు వెళుతుందని చాటిచెప్పారన్నారు. బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించి చదువుచెప్పి దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయరాలిగా ఆమె ఖ్యాతి గడించారన్నారు నేటి తరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ప్రదీప్, బి.కృష్ణ, కె.రాంబాబు, విష్ణు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
