స్కూల్‌ శానిటేషన్‌ వర్కర్లకు జీతాలివ్వాలి

May 16,2024 22:06
స్కూల్‌ శానిటేషన్‌ వర్కర్లకు జీతాలివ్వాలి

ప్రజాశక్తి-కడియం (మండపేట)గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న శానిటేషన్‌ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్కూళ్ల శానిటేషన్‌ వర్కర్స్‌, మిడ్డే మీల్స్‌ వర్కర్ల యూనియన్‌ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు కొమ్ము సత్యవేణి ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేషన్‌ వర్కర్లకు వేతనాలు అందించి ఆదుకోవాలని కోరుతూ కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారిని ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సత్యవేణి మాట్లాడుతూ కార్మికుల ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వం నెలనెలా వేతనాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

➡️