నేటి నుంచి మద్యం షాపుల సిబ్బంది బంద్‌

Sep 30,2024 23:23
నేటి నుంచి మద్యం షాపుల సిబ్బంది బంద్

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రభుత్వ మద్యం పాలసీ రద్దు అవుతున్న తరుణంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నిసారు వేడుకున్నా ప్రభుత్వం స్పందించనందున్న మంగళవారం నుంచి విధులు బహిష్కరిస్తున్నట్టు ఎపి బెవరేజెస్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరంలో డిపో మేనేజర్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించామని, అయినా ప్రభుత్వం తమను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️