ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది

Nov 30,2024 23:09
ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది

ప్రజాశక్తి-కడియం సమాజంలో అందరూ ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తారని హెచ్‌ఎం టి.సత్యనారాయణ అన్నారు. కడియం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ బీర పుష్పకుమారి ఉద్యోగ విరమణ సందర్భం పుష్పకుమారి, జయరాజు దంపతులను స్టాఫ్‌ కార్యదర్శి గొల్లపల్లి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధువులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాలకు రూ.13 వేల విలువైన ఇనుప బీరువా, రూ.12 వేల విలువైన క్రీడాకారుల యూనిఫామ్స్‌ బహూకరించారు. పుష్పకుమారి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 35 ఏళ్లు వృత్తే ప్రధాన ధ్యేయంగా పని చేసిన సుబ్బలక్ష్మి టీచర్‌ ఉపాధ్యాయులందరికీ ఆదర్శనీయమని వీరవరం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విశ్వనాథం పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన టి.సుబ్బలక్ష్మిని శనివారం సత్కరించారు. హెచ్‌ఎంలు జయలక్ష్మి, ఇవివిఎస్‌ఎస్‌.ప్రసాద్‌, రిటైర్డ్‌ ఎంఇఒ వి.లజపతిరారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు తదితరులు ఆమెను ఘనంగా సత్కరించి ఆమె చేసిన విద్యా, సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కనుమాంబ, విజరు కుమార్‌, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️