జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి.శాంతమని
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : వై.టి.సి ఆవరణలో శనివారం “స్వచ్ఛందర క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి , జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి , జిల్లా సూక్ష్మ సేద్య అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారి, మార్కఫెడ్, అగ్ని మాపక, జిల్లా పరిశ్రమల అధికారి కార్యాలయాల అధికారులు సిబ్బంది క్లీన్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాంతమణి మాట్లాడుతూ, చెత్త నుంచి సంపద సృష్టించే విధానంలో ప్రజలను భాగస్వాములను చేయడం జరుగుతోందని తెలిపారు. పొడి చెత్త, తడి చెత్త నుంచి సంపద తయారీ చేసే విధానంలో ప్రజలను భాగస్వాములను చేస్తామని, ఇందుకు సంబంధించి తడి పొడి చెత్త లను సేకరించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. నేరుగా ప్రజల నుంచి సేకరించిన వాటిని సంపద తయారీ కేంద్రాలకు తరలించి, సంపద సృష్టించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇందుకు అధికారులను, సిబ్బంది సమన్వయంతో పని చేస్తామని ప్రతిజ్ఞ చెయ్యడం జరిగిందన్నారు.
మనం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా మనం నివసించే ప్రాంతాల్లో, కార్యాలయాల్లో ప్రతి నెలా మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిని కలిగించేలా కొనసాగిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్ శ్రీనివాస్ , జిల్లా సూక్ష్మ సేద్య అధికారి ఏ దుర్గేష్ , జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏ. నాగ మహేశ్వర రావు , ఫుడ్ సేఫ్టీ అధికారి రుక్కయ్య , మార్కఫెడ్ డి ప్రతాప్ అగ్ని మాపక, జిల్లా పరిశ్రమల తదితర శాఖల అధికారులు సిబ్బంది, ధవళేశ్వరం పంచాయతీ సిబ్బంది, సానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.