జెఇఇ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం

Jun 9,2024 23:43
జెఇఇ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక జెఇఇ అడ్వాన్డ్స్‌ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటి అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు 385 మంది ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు జి.ఎన్‌. వెంకట దుర్గ సాయి 53వ ర్యాంకు, కె.సాకేత్‌ ప్రణవ్‌ 92వ ర్యాంకు, జి.సత్యనారాయణ 114వ ర్యాంకు, బి.హేమంత్‌ 123వ ర్యాంకు, ఎన్‌.నిషాంత్‌ 126వ ర్యాంకు, ఆర్‌.పవిత్ర 129వ ర్యాంకు, ఎం.వినేష్‌ కుమార్‌ 133వ ర్యాంకు, ఎంజి.వెంకట మహేష్‌ 136వ ర్యాంకు, ఎం.చరణ్‌శ్రీ తేజ 157వ ర్యాంకు, ఎన్‌.హార్దిక్‌ 217వ ర్యాంకు, జి.చంద్ర ప్రకాష్‌ 225వ ర్యాంకు, ఎం.శ్రీమణికంఠ 235వ ర్యాంకు, టి.ఆదిత్య 236వ ర్యాంకు, సిహెచ్‌.ధనుంజయ 276వ ర్యాంకు, పి.సాయి అమత్‌ 291వ ర్యాంకు సాధించడంతో పాటుగా 342, 352, 372, 391, 407, 424, 427, 440, 476 ర్యాంకులు, వెయ్యి లోపు 549 మంది, 3000 లోపు 163 మంది, 5000 లోపు 256 మంది, 10000 లోపు 334 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. 180 మంది పైన విద్యార్థులు ఐఐటిలో సీట్లు సాధించగలరని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అకడమిక్‌ డైరక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపల్‌ వి.శ్రీహరి అభినందించారు.

➡️