స్థానిక ప్రజాప్రతినిధులకు నేడు శిక్షణ

Mar 12,2025 12:22 #East Godavari

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: జడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు వంటి స్థానిక ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహింపబడుతుందని ఎంపీడీవో వివివిఎస్ రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయం, సమావేశ మందిరంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించనున్న ఈ శిక్షణా తరగతులకు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రజా ప్రణాళిక ఉద్యమం 2025-26 గ్రామపంచాయతీ వార్షిక ప్రణాళికలు తయారు చేయుట, మార్గదర్శకాలు సూచిస్తూ మండల స్థాయిలో స్థానిక ప్రభుత్వాలకు ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులందరికీ  ఈ శిక్షణ ఉంటుందన్నారు.

➡️