ప్రజాశక్తి – ఉండ్రాజవరం: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం పెరవలి యూనిట్ అధ్యక్షునిగా, కె.ఉమామహేశ్వరరావు ఎన్నికైనట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమకు రావాల్సిన హక్కుల గురించి పాటు పడతానని పేర్కొన్నారు. పెరవలి, ఉండ్రాజవరం, తణుకు మండలాలు యూనిట్ గా నిర్వహించిన ఎన్నికలలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నూతన సభ్యులు తెలిపారు. ఉపాధ్యక్షులుగా ఎం విజయలక్ష్మి, వి.సురేంద్రనాథ్ ప్రధాన కార్యదర్శి, జి వెంకటేశ్వరరావు అదనపు కార్యదర్శి, ఐ శ్రీనివాసరావు ట్రెజరర్, పి సురేష్, టి శ్రీనివాసరావు జిల్లా కౌన్సిలర్ లుగా ఎన్నికయ్యారు.
