వేసవి విజ్ఞాన శిబిరాలను వినియోగించుకోవాలి

May 15,2024 22:31
వేసవి విజ్ఞాన శిబిరాలను వినియోగించుకోవాలి

ప్రజాశక్తి-కడియం విద్యార్థుల్లో సృజనాత్మాకత వెలికి తీయడమే గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం ముఖ్య ఉద్దేశమని గ్రంథాలయ అధికారి శెట్టిపల్లి శ్రీదేవి నిర్మల అన్నారు. కడియం గ్రంథాలయంలో రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి జూన్‌ 7వ తేదీ వరకు జరిగే వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరాలను కడియం శాఖా గ్రంథాలయంలో బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి విద్యార్థీ వినియోగించుకుని విజ్ఞాన సంపన్నులుగా తయారు అవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు డి.హనుమంతు, బి.శ్రీనివాసు, చంద్రరావు, పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️