ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఐదు జిల్లాల ప్రాంతీయ విద్యా సదస్సు ఈ నెల 23న రాజమహేంద్రవరంలో నిర్వహిస్తుననట్టు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ పేర్కొన్నారు. స్థానిక యుటిఎఫ్ హోమ్‌లో గురువారం జయకర్ అధ్యక్షతన యుటిఎఫ్ జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. జయకర్ మాట్లాడుతూ యుటిఎఫ్ పోరుబాటలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు యుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం హాజరవుతారని చెప్పారు. యుటిఎఫ్ కార్యకర్తలు మండలాల స్థాయిలో సర్వే నిర్వహించి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌కు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణ కుమారి మాట్లాడుతూ 117 జిఒ రద్దు, పాఠశాలల విలీనంపై ప్రభుత్వం స్పందించాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల రూ.25 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్, ఉపాధ్యక్షులు విజరు గౌరి, కోశాధికారి ఇవిఎస్‌ఆర్.ప్రసాద్, కార్యదర్శులు ఇ.శ్రీమణి, దయానిధి, ఎం.శ్రీనివాస్, కె.రమేష్, చిలుకూరి శ్రీనివాసరావు, శ్రీనివాసమూర్తి, వి.వెంకటరమణ, సత్యనారాయణ, ప్రకాష్ పాల్గొన్నారు.
