రాఘవమ్మ ఆశయాలను కొనసాగిస్తాం..

Jan 19,2025 22:19
రాఘవమ్మ ఆశయాలను కొనసాగిస్తాం..

.ప్రజాశక్తి – అమలాపురంకుడుపూడి రాఘవమ్మ ఆశయాలను కొనసాగిస్తామని పలువురు వక్తలు అన్నారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో కుడిపూడి రాఘవమ్మ సంతాప సభ సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, డి.రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.బలరాం, పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు హాజరయ్యారు. తొలుత రాఘవమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడారు. పేదలు, మహిళలు, కార్మికుల కోసం రాఘవమ్మ చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. అప్పుడున్న పరిస్థితిల్లో రాఘవమ్మ ఎర్రజెండాను పట్టుకని ప్రజా సమస్యలపై గొంతు విప్పడం సాధారణ విషయం కాదన్నారు. ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మరో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ కుడుపూడి రాఘవమ్మ భర్త ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం తన భార్యను కమ్యూనిస్టు పార్టీ నాయకురాలుగా తయారు చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కమ్యూనిస్టుగా ఎర్ర జెండా పట్టుకుని ఏళ్ల తరబడి ప్రజా సమస్యలపై పోరాటం చేశారన్నారు. రాఘవమ్మ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భర్త మరణానంతరమూ ఆమె ఉద్యమాన్ని వీడలేదన్నారు. తాను నమ్మన సిద్ధాంతానికి తుది శ్వాస వరకూ కట్టుబడి ఉన్నారన్నారు. ఆమె ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం, ప్రజా సంఘాల్లో రాఘవమ్మ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. వ్యవసాయ కార్మికుల కోసం చేసిన పోరాటాలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బలరాం మాట్లాడుతూ ఎవరు ఏమైతే మనకెందుకులే అనే ఈ కాలంలో ఒక మహిళ ప్రజా సంఘాలు, ఉద్యమాల్లో పోరాటం చేయడం, జెండా పట్టుకుని రోడ్లపై తిరగడం సాధారణ విషయం కాదన్నారు. ఆమె ఆశయ సాధన కోసం మనమంతా కషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయన్నారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం పాటుపడాలని పిలుపునిచాచరు. కుడుపూడి రాఘవమ్మ ఆశించినట్టు ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న ఈ మతోన్మాద శక్తులను తిప్పి కొట్టడమే ఆమెకి ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌, డివి.రాఘవులు, టి.నాగవరలక్ష్మి కాకినాడ జిల్లా నాయకులు కమిడి సత్య శ్రీనివాస్‌, మోర్త రాజ్‌శేఖర్‌, సిహెచ్‌.రమణి, నాయకులు పి.రామకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, కెవిపిఎస్‌ కాకినాడ జిల్లా నాయకులు సింహాచలం, పాలిక శ్రీను అంగన్‌వాడీ సంఘం నాయకులు అమూల్య, గంగారత్నం, దైవకృప, నాయకులు బుంగ సత్యనారాయణ, పీతల రామచంద్రరావు, వెంకట్రావు, తాడి శ్రీరామ్మూర్తి, సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

➡️