స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం…

Oct 2,2024 23:32
విశాఖ స్టీల్‌

కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటు పరం కాకుండా మళ్లీ పోరాడి కాపాడుకుంటామని కేంద్ర కార్మిక, రైతు, ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం కోటిపల్లి బస్టాండ్‌ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర్‌బాబు అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముకగా ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు వారికి అమ్మడం దేశద్రోహమేనన్నారు. ఆంధ్ర ప్రజలు నాడు విరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేసి ప్లాంటును సాధించుకున్నారని గుర్తు చేశారు. ఆ త్యాగం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కాదన్నారు. రాష్ట్రంలో టిడ్పిఇ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ కూడా సొంత రాష్ట్రంలో ఉక్కుకు సొంతగునులు సాధించలేకపోవడం, కేంద్ర ాన్ని నిలదీసి మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ ప్రగాల్బాలు పలికే సిఎం చంద్రబాబు, టిడిపి ప్రభుత్వం ఎవరి ప్రయో జనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. ఐఎఫ్‌ టియు జిల్లా అధ్యక్షులు కె.జోజి, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు చీకటిపల్లి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.పవన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉత్పాదకత ఉండదని, సామర్థ్యం మేరకు ఉద్యోగులు పనిచేయరని ప్రచారం చేస్తున్న కార్పొరేట్‌, బూర్జువా మేధావులు విశాఖ ఉక్కు పరిశ్రమలో తయారయ్యే నాణ్యమైన ఉక్కును ప్రెవేటు ఉక్కు సంస్థలు ప్రజలకు ఎందుకు అందించలేకపోతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. సొంత గనులు లేకపోయినా ముడ ిసరుకు అవసరం మేరకు అందించిన సంవత్సరంలో 120 శాతం సామర్థ్యంతో పనిచేయడం కనిపించలేదా అని ఎద్దేవా చేశారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరావేశంతో జగన్‌ ప్రభుత్బంపై విరుచుకుపడిన పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబు ఇప్పుడు ఉక్కు పరిశ్రమలోని 4వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రయివేటీ కరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగులను ఇతర రాష్ట్రాలకు బలవంతంగా బదిలీ చేస్తుంటే మౌనం ఎందుకు వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పరిశ్రమలే పెట్టని ప్రయివేటు సంస్థలకు ఇనుప ఖనిజం కేటాయిస్తూ, ప్రజల సంపదతో నిర్మించిన, త్యాగలతో సాధించుకున్న విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా నష్టాలొ స్తున్నాయనడం దుర్మార్గమన్నారు. ఈ దీక్షలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షలు వై.భాస్కర్‌, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు వి.రాంబాబు, ఎల్‌ఐసి డివిజన్‌ కార్యదర్శి కోదండరాం, ఎఐటియుసి నాయకులు కొండలరావు, సిఐటియు జిల్లా కోశాధికారి కెఎస్‌వి.రామచంద్రరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు తదితరులు మాట్లాడారు. రైతు సంఘం నాయకులు సుబ్బారావు, పడాల.రామకష్ణ, ప్రజాసంఘాల నాయకులు బేబీ రాణి, మాణిక్యాంబ, అన్నామని, వెంకటలక్ష్మి, రాజా, జ్యోతి, తాతరావు, కె.రామకష్ణ, సుబ్రహ్మణ్యం, సోమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

➡️