ప్రజాశక్తి – తాళ్లపూడి
ఎన్‌డిఎ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయ డంలో విఫలమైందని, దీన్ని నిరసిస్తూ ఈ నెల 12న చేపట్టే ‘యువత పోరు’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసిపి నాయకులు పిలుపునిచ్చారు. తాడిపూడి సర్పంచ్ నామా గోపాలం ఇంటి వద్ద యువత పోరుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చి అన్ని రంగాల కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కె.రమేష్, ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, వైసిపి మండల అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు, పోలవరం ఎంపిపి ఎస్ వెంకటరెడ్డి, గజ్జరం సర్పంచ్ డాక్టర్ గండి రాంబాబు, వైసిపి జిల్లా నాయకులు పోసిన శ్రీకృష్ణదేవరాయల, గూడ విజయరాజు, యాళ్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
