ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : గర్భవతులు, బాలింతలు నాణ్యమైన ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ఆహారాన్ని తీసుకోవాలని పిహెచ్ సి వైద్యులు నాగార్జున తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సోమవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి, ప్రకృతి వ్యవసాయ న్యాచురల్ ఫామింగ్ అసిస్టెంట్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ …. ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన ఎరువులతో సాగు చేసి పండించిన ఉత్పత్తులు ఆరోగ్యానికి ఆరోగ్యకరం అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ప్రతి నెల 9న ఆసుపత్రి ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తమ సొంత పొలాల్లో సాగు చేసి పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను గర్భవతులు,బాలింతలు కొనుగోలు చేసేందుకు సాధారణ ధరలకే అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం గర్భవతులు, బాలింతలకు ప్రకృతి వ్యవసాయ కూరగాయలు, ఆకుకూరలు అందించారు. కార్యక్రమంలో ఎమ్.పి.హెచ్.ఈ.ఓ. శ్రీనివాసరెడ్డి, సూపర్ వైజర్ శోభా రాణి,ప్రకృతి వ్యవసాయ డివిజన్ మోడల్ మేకర్ నుజహత్, సిబ్బంది రామసుధ, ముని భూపాలుడు, శిక్షణా ఎన్‌ఎఫ్‌ఎ మేరి, వివిధ గ్రామాల ప్రకఅతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
