వరద బాధితులకు ఎఫికోర్‌ – న్యూ ఢిల్లీ వారి చేయూత

ఇబ్రహీంపట్నం (జూపూడి) (ఎన్టీఆర్‌ జిల్లా) : ఎఫికోర్‌ – న్యూ ఢిల్లీ వారి స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనందించారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో సుమారు 500 మంది వరద బాధిత కుటుంబాలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ … ఇటీవల వచ్చిన అకాల వరదల వల్ల మైలవరం నియోజకవర్గంలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారన్నారు. వరద బాధితులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులకు, దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️