ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో చేనేత కార్మికులకు, పెన్షన్ దారులకు, వారి కుటుంబాలకు అందుబాటులో ఉంటూ చేనేత ఆర్థిక అభివద్ధికి కృషి చేస్తానని చేనేత కార్మికుల జౌళి శాఖ అధికారి డి. కష్ణ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో చేనేత కార్మికులు, చేనేత సొసైటీలు, చేనేత అధికారుల పని విధి విధానాల గురించి, చేనేత పెన్షన్ దారులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు వంటి వాటిపై ‘ప్రజాశక్తి’కి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.జిల్లాలో చేనేత అధికారులు, కార్యాలయాల వివరాలు తెలియజేయండి ? అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయం ఉంది. ఇందులో ఆరుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా చేనేత,అబివద్ధి, సహాయ అభివద్ధి అధికారులు మొత్తం నలుగురు ఉన్నారు. చేనేత అధికారుల పని వివరాలు తెలపండి? జిల్లాలో చేనేత సొసైటీలో ఉన్నటువంటి కార్మికుల అందరికీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలను , అర్హతను బట్టి కార్మికులకు, చేనేతలకు అధికారుల ద్వారా అందజేస్తారు.జిల్లాలో మగ్గాలు చేనేత కుటుంబాల వివరాలు తెల్పండి ? జిల్లాలో సుమారుగా 6500 చేనేత మగ్గాల కుటుంబాలున్నాయి. 2100 విద్యుత్ మగ్గాలు ఉన్నాయి.31 మంది సభ్యులు ఉన్నారు. 85 చేనేత మగ్గాలు, 32 విద్యుత్ మగ్గాలు ఉన్నాయి. వీరబల్లి, పుల్లంపేట, రాజంపేట, చిన్న మండ్యం, మదనపల్లి టౌన్, రూరల్, కురబల కోట, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, మొలకలచెరువు, నిమ్మనపల్లి, కలకడ, పీలేరు ప్రాంతంలో చేనేత పరిశ్రమలున్నాయి.జాతీయ చేనేత క్లస్టర్ పథకాలు వివరాలు తెలపండి? అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం జాతీయ ఐదు చేనేత క్లస్టర్లు అమలలో ఉన్నాయి. ఇందులో అంగళ్లు, రాజానగర్‌్, నిరుగట్టువారిపల్ల్‌ి, కొళ్లబైలు చౌడేశ్వరి క్లస్టర్లున్నాయి. చేనేత కార్మికులకు ప్రభుత్వం ముద్రా రుణాలు మంజూరు చేస్తుంది. జాతీయ చేనేత క్లస్టర్ లు ద్వారా చేనేత కార్మికులకు పనిముట్లు అందజేస్తారు. అన్నమయ్య జిల్లాలో మొత్తం 59 చెనేత సహకార సంఘాలున్నాయి. జిల్లాలో సిబ్బంది కొరత ఏమైనా ఉందా?జిల్లాలో చేనేత కార్యాలయం సంబంధించిన సిబ్బంది కొరత గతంలో ఉండేది. ప్రస్తుతం ఇటువంటి సిబ్బంది కొరత లేదు. జిల్లాలో చేనేత కార్మికుల కుటుంబాలు ఎవరు కూడా మధ్యవర్తులను సంప్రదించరాదు. చేనేత , జౌళి శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ , అభివద్ధి పథకాల కోసం చేనేత కార్మికులు నేరుగా తమ కార్యాలయంలో సంప్రదించాలి.
