ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మం డలంలోని అన్ని పంచాయతీ ల్లో తాగునీరు, విద్యుత్ రహ దారులు, విద్య, వైద్యం తది తర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్ అ న్నారు. బుధవారం యర్ర గొండపాలెం పట్టణంలో ఆ యనను మండలంలోని పలు పంచాయతీల సర్పంచులు, నాయకులు కలిశారు. సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానంగా వేసవి వస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని తెలిపారు. మరమ్మతులకు గురైన తాగునీటి బోర్లకు మరమ్మతులు చేయించుకోవాలని తెలిపారు. నీటి లభ్యత లేక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తే తెలియ జేయాలని చెప్పారు. వైద్య సిబ్బంది కూడా గ్రామాల్లో అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. వ్యవసాయ సిబ్బంది ప్రస్తుత పంటల్లో నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతాంగానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. విద్యుత్ అధికారులు కూడా గ్రామాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మురారిపల్లి సర్పంచ్ ఏకుల ముసలారెడ్డితో పాటు వివిధ పంచాయతీల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.
