‘పది’లో ఉత్తమ ఫలితాలకు కృషి

ప్రజాశక్తి-రాయచోటి పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో ఉత్తమ పలితాలు సాధించడానికి కషి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాబోయే పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు, ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి చర్యలు, ప్రణాళికలు, విద్యార్థులు ఎలా చదవాలో, పరీక్షలు ఎలా రాయాలో, విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటి వాటి పై ప్రజాశక్తికి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.జిల్లా వ్యాప్తంగా హైస్కూల్‌ వివరాలు తెలపండి? అన్నమయ్య జిల్లాలో మొత్తం 505 ప్రభుత్వ, ప్రయివేటు ఉన్నత పాఠశాలలు కలవు. ఎయిడెడ్‌ 5, ఎపిఎంఎస్‌ 17, ఎపిఆర్‌ఎస్‌ 8, ఎస్‌హెచ్‌ ఆర్‌ఎఎం 1, బిసి వెల్ఫేర్‌ 4, ప్రభుత్వ కెజిబివి 22, ఎంపిఎల్‌ 7, ప్రయివేట్‌ 198, స్కూల్‌ వెల్ఫేర్‌ 11, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 8, జడ్పీ 214 పాఠశాలలున్నాయి.పది పరీక్షల్లో ఎప్పటినుండి ప్రారంభమవుతున్నాయి? పదివ తరగతి పరీక్షలు ఈ నెల 17వ తేదీ నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి 12.45 వరకు జరుగుతాయి. మొత్తం 22,355 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.పరీక్ష కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు? జిల్లాలో మొత్తం 121 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. 121 చీప్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు 1200, ఇన్విజిలేటర్లును ఏర్పాటు చేశాం.పరీక్షల షెడ్యూల్‌ వివరిస్తారా? పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 17 నుండి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్నాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షలు 17వ తేదీన మొదటి భాష, 19న రెండవ భాష, 21న ఇంగ్లీష్‌, 24 గణితం, 26న ఫిజిక్స్‌, 28 బయాలజీ, 29న వత్తి విద్యా, ఏప్రిల్‌ 1న సాంఘిక శాస్త్రంతో ముగుస్తాయి.పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? కలెక్టరు శ్రీధర్‌ చామకూరి ఆదేశాల మేరకు జిల్లా అధికారులకు, జిల్లా విద్య అధికారికి అన్ని పరీక్షా కేంద్రాలలో వైద్య సదుపాయాలను సమకూర్చాలని తెలియజేశాం. ఎపిఎస్‌ ఆర్టీసీ వారికీ పరీక్ష సమయానుకూలంగా ఆయా రూట్స్‌లో రవాణా సదుపాయం కల్పించాలని చెప్పాం. పోలీస్‌ అధికారులకు పరీక్ష కేంద్రాలలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.జిరాక్స్‌ సెంటర్‌లను పరీక్షా సమయంలోమూసివేస్తున్నాం.ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత కొరకు 100 రోజుల ప్రణాళికల ద్వార ఉత్తీర్ణత పెంపొందించ డానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? విద్యార్థులు టివిలు, సెల్‌ ఫోన్‌కు దూరంగా ఉండాలి. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పరీక్ష సెంటర్‌లోకి విద్యార్థులకు 30 నిమిషాలు ముందుగానే హాజరు కావాలి. విద్యార్థులకు ప్రతి సెంటర్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి అన్నమయ్య జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలపడానికి అందరు సహకరించాలి.

➡️