ప్రజాశక్తి-కనిగిరి: గుంతలు పడి ప్రమాదకరంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టి అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. గుంతలు లేని రోడ్ల కోసం ప్రభుత్వం ముందడుగు కార్యక్రమాన్ని చేపట్టగా శనివారం కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంఖవరంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసహారెడ్డి ప్రారంభించారు. తారు రోడ్డుపై పడిన గుంటలను ఆయన పూడ్చి పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో రహదారులకు పడిన గుంటలను పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి డీఈ షఫీ, ఏఈ ఫిరోజ్, టిడిపి పట్టణ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, నాయకులు తమ్మినేని వెంకట్‌రెడ్డి, ముచ్చుమారి చెంచిరెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, కొండలు, కాసుల శ్రీరామ్ యాదవ్, తమ్మినేని సురేంద్ర, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.