భీమిలిలో సబ్‌ కోర్టు ఏర్పాటుకు కృషి

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ప్రజాశక్తి -భీమునిపట్నం : భీమిలిలో సబ్‌ కోర్టు ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గురువారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు ఎమ్మెల్యే గంటాను కలిశారు. భీమిలిలో సబ్‌కోర్టు ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ, దీనికి సంబంధించిన ఫైల్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని, దానిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే గంటా స్పందిస్తూ, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. అంతకుముందు బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు ఎమ్మెల్యే గంటాకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎంవి పార్వతీశం, కార్యదర్శి కెఎస్‌ఎం సుధాకర్‌, కోశాధికారి ఎం.సునీల్‌, ఎజిపి పాత్రుడు, లాయర్లు గౌతమ్‌, వెంకటేష్‌ ,సుందర్‌సింగ్‌, భరద్వాజ్‌, బోని శివ, మాధవి ఉన్నారు

➡️