ప్రజాశక్తి-చీమకుర్తి : చీమకుర్తి ప్రాంత గ్రానైట్ యజమానుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. రామతీర్థంలోని విటిసి సెంటర్‌లో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల యజమానుల సంఘాల సంయుక్త సమావేశం మంగళవారం నిర్వహిం చారు.ఈ సమావేశానికి ఎర్రగుంట్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ సంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్. విజయకుమార్‌తో కలిసి పాలిషింగ్ యూనిట్ల యజమానుల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివద్ధికి, యువత ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. చీమకుర్తి గ్రానైట్ పాలిసింగ్ యజమానుల సంఘం అధ్యక్షుడు కాట్రగడ్డ రమణయ్య మాట్లాడుతూ పాలిసింగ్ యూనిట్ల పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటుందని ప్రభుత్వం చేయూత అందించాలన్నారు. అనంతరం యూనిట్ల యజమానులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని, శిద్దా సూర్య ప్రకాష్‌రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి ఏరియా గ్రానైట్ పాలి సింగ్ యజమానుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాట్రగడ్డ రమణయ్య, నూకల సురేంద్ర కుమార్, జిల్లా ప్రతినిధి కందిమళ్ల గంగాధర్‌రావు, ఉపాధ్యక్షుడు అహమ్మద్ బాషా, గౌర వాధ్యక్షుడు జి.నాగయ్య, ఆర్‌ఎల్.పురం యూనిట్ల సంఘ అధ్యక్షుడు ఎర్రగుంట్ల శ్రీనివాసరావు, కోకా రామారావు, మలినేని వెంకటేశ్వర్లు, బుధవాడ యూనిట్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు లగడపాటి శ్రీనివాసరావు, భవాని ప్రసాదు, ఏలూరు రోడ్డు యూనిట్ల సంఘం అధ్యక్షుడు నన్నూరి సుబ్బారావు, శ్రీనివాసులు రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎస్‌కె.రఫీ, ఎస్‌కె. అప్సాలేహ, చలపతిరావు, ఉదరు పాల్గొన్నారు.