ఉద్యాన వనాభివృద్ధికి కృషి

May 15,2024 21:14

ప్రజాశక్తి – రామభద్రపురం : మండలంలోని 200 ఎకరాల్లో ఈ ఏడాది ఉద్యానవనాభివృద్ధి ( హార్టికల్చర్‌) చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఉపాధిహామీ పథకం అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జనార్ధన్‌ తెలిపారు. మండల ఉపాధిహామీ కార్యాలయంలో బుధవారం ఆయన అధికారులతో మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి లబ్ధిదారులకు వంద ఎకరాల్లో తోటల పెంపకం చేపట్టనున్నట్టు తెలిపారు. 2 సంవత్సరాల కాలంలో ఎకరాకు రూ.1.13లక్షలు ఆర్థికసాయం అందిస్తామ న్నారు. వందరోజుల పని కోసం ప్రణాళికలు రూపొందించామని, ఎస్‌సి, ఎస్‌టి వికలాంగులకు వందశాతం పని కల్పించాలని సూచించారు. కొలతలు ప్రాప్తికి పనులు చేపట్టాలని, సరాసరి కూలీ కింద రూ.300లు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది అమృత సరోవర్‌, ఫారంఫాండ్స్‌, రింగ్‌ ట్రెంచిల నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎపిఒ జి.త్రినాథరావు, ఈసీ సత్యనా రాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️