మాడుగుల సమగ్రాభివద్ధికి కృషి :బండారు.

బండారు సత్యనారాయణమూర్తి

ప్రజాశక్తి-కె.కోటపాడు: వైసిపి పాలనలో నిర్లక్ష్యానికి గురైన అన్ని రంగాలను పరిపుష్టి చేసి, మాడుగుల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని కొత్త ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా కే కోటపాడులో పర్యటించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించిన మాడుగుల ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. వెనుకబడి ఉన్న మాడుగుల నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తున్నామన్నారు. గ్రామాలకు చిన్నచిన్న రోడ్లు వేస్తే అభివద్ధి జరగదని కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాసంస్థల నెలకొల్పాలన్నారు. ఏ నియోజకవర్గంలో లేనివిధంగా మాడుగులలో ఐదు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని, వైసిపి పాలనలో నిర్లక్ష్యానికి గురైన వాటిని అభివృద్ధి చేస్తానన్నారు. రైవాడ, దాచేరు, పెద్ద్దేేరు రిజర్వాయర్లు అభివృద్ధి చేస్తానన్నారు. తాచేరు నీటి వృథాను అరికట్టి, రిజర్వాయర్‌ గేట్లు మరమ్మత్తులు చేయిస్తామన్నారు. జలజీవన్‌ మిషన్‌ పనుల్లో అవినీతిపై సిఐడి విచారణ చేయించి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానన్నారు. 2019కు ముందు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని, వారందరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యకర్తల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు , పైలా ప్రసాదరావు, పీవీ జి కుమార్‌ , మండల పార్టీ అధ్యక్షుడు రొంగలి మహేష్‌, జురెడ్డి రాము, చౌడువాడ సర్పంచ్‌ దాడి ఎరుకు నాయుడు పాల్గొన్నారు.

వైసిపి రాక్షస పాలనను తరమికొట్టారు

దేవరాపల్లి: రాష్ట్రంలో వినాశన పాలన పోవాలని ప్రజలు కసిగా, పట్టుదలతో ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా శాయశక్తలా కృషి చేస్తానని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దేవరాపల్లి మండలంలో పర్యటించిన ఆయనకు ఘనస్వాగతం లభించింది.కాశీపురంలో టిడిపి మండల అధ్యక్షులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఇంటి వద్ద శుక్రవారం సాయంత్రం కేకును కట్‌ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు .మండల నలుమూలల నుంచి వచ్చిన కూటమి శ్రేణులు ఎమ్మెల్యే బండారును ఘనంగా సత్కరించారు.అనంతరం బండారు మాట్లాడుతూ, భారీ మెజారిటీతో గెలిపించిన కూటమి శ్రేణులకు కతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాడుగుల నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేస్తానన్నారు. కార్యక్రమంలో పైలా ప్రసాదరావు, పోతల పాత్రునాయుడు, శరకాన సూర్యనారాయణ, వై. కరుణాకరరావు, కొమర బాబురావు,పెద్దాడ వెంకట రమణ, అవుగడ్డ కోటిపల్లి నాయుడు, చల్లా నానాజీ జనసేన మండల అధ్యక్షులు గొర్రుపోటు రామూర్తి నాయుడు, బీజేపీ మండల అధ్యక్షులు కాళ్ళ ప్రసాద్‌, కాశీపురం సర్పంచ్‌ ఆదిరెడ్డి వరలక్ష్మి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారు

➡️