ఆర్‌టిసి అభివృద్ధికి కృషి చేయాలి

Sep 30,2024 21:34
ఫొటో : మొక్కను నాటుతున్న ఎపిఎస్‌ ఆర్‌టిసి గుంటూరుజోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు

ఫొటో : మొక్కను నాటుతున్న ఎపిఎస్‌ ఆర్‌టిసి గుంటూరుజోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు

ఆర్‌టిసి అభివృద్ధికి కృషి చేయాలి

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు ఆర్‌టిసి డిపోను లాభాల బాటలో నడుపుతూ అభివృద్ధి దిశగా పయనింపచేసేందుకు అందరూ కృషి చేయాలని ఎపిఎస్‌ ఆర్‌టిసి గుంటూరుజోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వారు ఆత్మకూరు ఆర్‌టిసి డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆర్‌టిసి మెయిన్‌ బస్టాండ్‌తో పాటు మున్సిపల్‌ బస్టాండ్‌ను పరిశీలించారు. అనంతరం గ్యారేజ్‌, ట్రాఫిక్‌, ఆర్‌టిసి కార్గోను తనిఖీ చేశారు. బస్సుల కండిషన్‌ను పరిశీలించారు. ఆత్మకూరు డిపో పరిధిలోని ఆదర్శ ఉద్యోగులను అభినందించారు. వారు మాట్లాడుతూ డిపో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్మికులు బస్సు కండిషన్‌ను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా చెక్‌ చేసుకోవాలని తెలిపారు. తదుపరి డిపో ఆవరణములో వారు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్‌టిసి డిపో మేనేజర్‌ కరిమున్నిసా, యూనియన్‌ నాయకులు, ఆర్‌టిసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️