పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

ప్రజాశక్తి-కొండపి: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పొగాకు వేలం నిర్వహణాధికారి సునీల్‌ కుమార్‌ పొగాకు రైతులకు సూచించారు. చవటపాలెం గ్రామంలో పొగాకు రైతులకు అటవీ మొక్కలు అయిన టేకు, బాదం, గానుగ, తెల్ల మద్ది, ఉసిరి మొక్కలను బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ పొగాకు బ్యారెన్‌ లైసెన్సు ఉన్న ప్రతీ రైతు విధిగా పది మొక్కలు నాటాలన్నారు. బ్యారెన్లలో క్యూరింగ్‌ కోసం 30 నుంచి 40 టన్నులు కలపని ఇంధనంగా వాడుతున్నందున పర్యావరణంపై ప్రభావం పడుతుందన్నారు. దీని నివారణకు రైతులు కలప జాతి మొక్కలు పెంచాలన్నారు. చవటపాలెం గ్రామాన్ని ఈ ఏడాది ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు పొగాకుతో పాటు వివిధ రకాల ప్రత్యామ్నాయ పంటలైన కంది,మిరప, శెనగ పండించ డం ద్వారా ప్రతికూల వాతావరణం, మార్కెట్లో ఒడిదు డుకులు ఎదురైనప్పుడు రైతులు ఆర్థికంగా నిల దొక్కుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిపిఐ లిమిటెడ్‌ కంపెనీ మేనేజరు ఉన్నం శ్రీనివాసరావు, మ్రోతిలాల్‌, రైతులు, పొగాకు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.

➡️