బాల్య వివాహాల నిర్మూలనకు కృషి

Dec 10,2024 16:18 #meri

ప్రజాశక్తి – కొత్తపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసిడిఎస్ ఏ సి డి పి ఓ మంగవల్లి ఎంపీడీవో దాసరి మేరి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన కొత్తపల్లిలో
ఉన్న ఎంపీడీవో కార్యాలయం నందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న అన్ని శాఖల అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అందరం కలిసి కృషి చేయాలి అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలిక భవిష్యత్తుకు భంగం కలుగుతుంది అన్నారు. పలు గ్రామాలలో జరిగే బాల్య వివాహాల ను అరికట్టేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరం అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ గ్రామాల్లోనైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి బాలిక జీవితాన్ని కాపాడాలని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో బాలికలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం జరిగిందని అవకాశాలను అందిపుచ్చుకొని మంచి ఉన్నత స్థాయిలో బాలికలు ఉండాలని తెలిపారు. బాలికలు మహిళలు మనం ఉన్న పరిధిలో ఆపదలు సంభవిస్తే రక్షించాల్సిన బాధ్యత ఉంది అన్నారు. ఆడపిల్లలను చదువుతోపాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగేశ్వరమ్మ, ఆశీర్వాదమ్మ, శేషమ్మలు, వైద్యాధికారులు విజయేంద్ర ఏపీఎం పుల్లయ్య, అంగన్వాడి కార్యకర్తలు హరిత రవణమ్మ మరియమ్మ, సునీత, విజయమ్మ, శేషమ్మ ఎంపీహెచ్వోలు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లు, జి ఎం ఎస్ కే లు, అంగన్వాడి కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.

➡️