తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి
ప్రజాశక్తి – సామర్లకోట : ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా బుధవారం సామర్లకోట యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హై స్కూల్, అయోధ్యరాంపురం బచ్చు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ హై స్కూల్ ల లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా
డిసెంబర్ 5న జరిగే ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్నానని బొర్రా గోపి మూర్తి తెలిపారు. విజయానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో
సి.ఐ టి యు మండల అధ్యక్షులు నరవ సురేష్ , డివైఎఫ్ఐ నాయకులు కే తులసి దాస్, డి వి లక్ష్మణ్, ప్రజాసంఘాల నాయకులు దారబాని కృష్ణ బి.శ్రీను , డి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.