ప్రజాశక్తి – కిర్లంపూడి (కాకినాడ) : ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎలక్షన్ కమిషన్ వాహనాల రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టింది. దానిలో భాగంగా … మంగళవారం కిర్లంపూడి – ప్రత్తిపాడు ప్రధాన రహదారిపై ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ జి.రామతులసి, ఇతర అధికారులు, పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్క్వాడ్ రామతులసి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామన్నారు.
