ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేయాలి

May 15,2024 21:13

ప్రజాశక్తి- బొబ్బిలి : సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న వెకేషన్‌ డిపార్ట్మెంట్‌ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్లను తక్షణమే జారిచేయాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ జెసి రాజు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో ఫెడరేషన్‌ జోనల్‌ సమావేశాన్ని బొబ్బిలి మండల శాఖ అధ్యక్షులు సిహెచ్‌జె ప్రవీణ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జె సి రాజు మాట్లాడుతూ ఎఫ్‌ఆర్‌ 82, జిఒ నెం 114 ప్రకారం వేసవి సెలవుల్లో ఎన్నికల విధులు నిర్వహించే ఉపాద్యాయులు సంపాదిత సేవలకు అర్హులని, శిక్షణా తరగ తులు, విధుల్లో ఎన్ని రోజులు పాల్గొంటే ఆ మేరకు దామాషా పద్ధతిలో సంపాదిత సెలవులకు అర్హులు అవుతారని అన్నారు. అందుకోసం ఆయా నియోజక వర్గ రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్‌ జారిచేసేలా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కౌన్సెలర్‌ పద్మావతి మాట్లా డుతూ డ్యూటీ సర్టిఫికెట్ల జారీ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా ఎన్నికల అధికారికి కూడా ఎపిటిఎప్‌ లిఖితపూర్వకంగా ప్రాతినిధ్యం చేసిందని ఆమె తెలిపారు. అనంతరం వచ్చే విద్యా సంవత్సరంలో అకాడ మిక్‌ పరంగా ప్రభుత్వానికి ప్రాతినిత్యం చేయాల్సిన విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు బంకురు జోగి నాయుడు, సిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, వివిద మండలాల భాద్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️